శ్రీకాకుళం జిల్లాను పసి పాపలా చూసుకుంటాం...

శ్రీకాకుళం జిల్లాను పసి పాపలా చూసుకుంటాం...

తిత్లీ తుఫాన్‌ ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని మంత్రి లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. క్లిష్ట సమయంలో బాధితులకు ఆపన్న హస్తం అందించాలని కోరారు. ఈమేరకు ఆయన ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు పంపాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.  శ్రీకాకుళం జిల్లా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందన్న లోకేష్‌.. దెబ్బతిన్న గ్రామాలను దత్తత తీసుకునేందుకు ప్రముఖులు ముందుకురావాలని కోరారు. దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాను పసిపాపలా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.