నెల్లూరు జిల్లాలో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

నెల్లూరు జిల్లాలో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది..  నెల్లూరు జిల్లాలోనూ క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి.. ఇక‌, జిల్లాలో అత్య‌ధికంగా కేసులు న‌మోదు అవుతున్న ఆయా ప్రాంతాల్లో స‌డ‌లింపుల‌తో కూడిన లాక్‌డౌన్ కొన‌సాగిస్తున్నారు అధికారులు.. ఇక‌, క‌రోనా కేసుల తీవ్ర‌త దృష్ట్యా నేటి ‌నుంచి ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాలెంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు అధికారులు.. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు ఈ సంపూర్ణ లాక్‌డౌన్ కొన‌సాగ‌నుండ‌గా.. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉదయం  6-9 గంట‌ల‌ వరకు నిత్యావ‌స‌రాల షాపుల‌కు స‌డ‌లింపులు ఇచ్చారు. 

కాగా, నెల్లూరు జిల్లాలో ఇప్పటి వ‌ర‌కు 14,250 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి... ప్ర‌స్తుతం జిల్లాలో 7103 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. క‌రోనాబారిన‌ప‌డి పూర్తిస్థాయిలో కోలుకున్న‌వారి సంఖ్య 7147 కి పెరిగింది.. మ‌రోవైపు క‌రోనావైర‌స్‌తో పోరాటం చేసి.. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో 180 మంది ప్రాణాలు విడిచారు... ఇక‌, జిల్లా వ్యాప్తంగా 1,75,454 శాంపిల్స్ సేక‌రించ‌గా.. ఇప్ప‌టికే 1,72,838 టెస్ట్‌లు నిర్వ‌హించారు.