గుంటూరు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్.. ఎక్క‌డంటే..?

గుంటూరు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్.. ఎక్క‌డంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతూనే ఉంది.. అయితే, కేసుల తీవ్ర‌త ఉన్న ప్రాంతాల్లో మాత్రం... స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు అధికారులు.. ఇక‌, గుంటూరు జిల్లాలో ఆది నుంచి భారీ సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతూ వ‌చ్చినా..  రేప‌ల్లె మాత్రం గ్రీన్ జోన్‌గా ఉంది.. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది... కేసుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో.. రేప‌ల్లెలో మ‌రోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు అధికారులు.. ఈ నెల 16వ తేదీ నుంచి రేపల్లెలో సంపూర్ణ లాక్ డౌన్ అమ‌లు చేయ‌నున్నారు.. అయితే, ఉదయం 6 నుండి 9 గంట‌ల‌ వరకు మాత్రమే వ్యాపారాల‌కు మిన‌హాయింపు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు అధికారులు.. కాగా, కరోనా కాలంలో గ్రీన్ జోన్‌గా ఉన్న రేప‌ల్లె.. ప్ర‌స్తుతం మరో సారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది.