లాక్‌డౌన్ పొడిగించిన పుదుచ్చేరి..

లాక్‌డౌన్ పొడిగించిన పుదుచ్చేరి..

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం కొన‌సాగుతూనే ఉంది.. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌గా.. కేసుల ఉధృతి త‌గ్గ‌క‌పోవ‌డంతో.. మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వ‌స్తున్నాయి.. ఈ జాబితాలో ఇప్పుడు పుదుచ్చేరి కూడా చేరిపోయింది.. గ‌తంలో విధించిన లాక్‌డౌన్ ఇవాళ్టితో ముగిసిపోగా.. ఈ నెల 10వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్ల‌డించారు.. అయితే, ఈ స‌మ‌యంలో గ‌తంలో ఏదైతే అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారో.. ఈసారి కూడా అంతేన‌ని స్ప‌ష్టం చేశారు ఎల్‌టీ త‌మిళిసై.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలనీ... ఇంట్లో ఉన్నప్పటికీ విధిగా మాస్కులు ధరించాలని విజ్ఞ‌ప్తి చేశారు.. కాగా, ఢిల్లీలాంటి చోట ఇప్ప‌టికే లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌గా.. ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు.. రాత్రి క‌ర్ఫ్యూలు, డే క‌ర్ఫ్యూలు విధిస్తున్నారు.