కోర్టులకు లాక్‌డౌన్ పొడిగింపు

 కోర్టులకు లాక్‌డౌన్ పొడిగింపు

తెలంగాణలో కోర్టులు, ట్రిబ్యున‌ళ్ల‌లో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 5వ తేదీ వ‌ర‌కు పొడిగించింది రాష్ట్ర హైకోర్టు.. అత్యవసర కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది.. పిటిష‌న్లు ఆన్‌లైన్‌లో స్వీక‌రించాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది హైకోర్టు.. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని హైకోర్టు తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. కాగా... రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ క‌రోనా కేసులు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే.. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో క‌రోనా కేసులు అధిక సంఖ్య‌లో న‌మోదు అవుతూ.. ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.