లాక్ డౌన్ అలర్ట్: మీ వాహనం 3 కిలో మీటర్లు దాటితే అంతే..!

లాక్ డౌన్ అలర్ట్: మీ వాహనం 3 కిలో మీటర్లు దాటితే అంతే..!

లాక్ డౌన్ ప్రకటించారు.. ఇంటినుంచి కదలొద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. దీనిపై ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్, తెలంగాణ డీజీపీ, ఇతర అధికారులు స్పష్టమైన ప్రకటనలు చేసారు. కానీ, కొందరు మాత్రం దీనిని లైట్ గా తీసుకుంటున్నారు. బైకులు కార్లు వేసుకొని రోడ్లు ఎక్కుతున్నారు. అక్కడక్కడా వారికి పోలీసులు లాఠీ దెబ్బల రుచికూడా చూపిస్తున్నారు. అయినా కొందరిలో మార్పు కనిపించడం లేదు. దీంతో భారీ ఎత్తున ఫైన్ వేయడానికి సిద్దమైది తెలంగాణ సర్కార్. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసారు. నిత్యావసరాలకు అవసరమైన వాటిని తీసుకోవద్దని వెసులుబాటు ఉండగా.. ఇదే అదునుగా కొందరు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో వాహనదారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. వాటి ప్రకారం వాహనదారులు తమ వాహనంపై 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేస్తే జరిమానా విధిస్తారు. లాక్-డౌన్ అమలులో ఉన్న దృష్ట్యా, మీ వాహన 3 కిలో మీటర్లు దాటితే ఫైన్ విధిస్తామని.. అన్ని సీసీటీవీ కెమెరాలు, ఆటోమాటిక్ నెంబర్ ప్లేట్.. రికగ్నిషన్ సాంకేతికతతో లింక్ చేశామని తెలిపారు.. దయచేసి, ఇంటి వద్దనే ఉండండి, విధులలో ఉన్నవారిని గౌరవించండి, స్వీయనియంత్రణపాఠించండి అని తన ప్రకటనలో కోరారు డీజీపీ... అంటే ఇంటిదగ్గర వుండండి కరోనాతో పాటు జరిమానాల నుంచి కూడా తప్పించుకోండి.