లోన్ యాప్స్ కేసు.. మరో చైనా దేశస్థుడి అరెస్ట్ !

లోన్ యాప్స్ కేసు.. మరో చైనా దేశస్థుడి అరెస్ట్ !

లోన్ యాప్స్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. గతంలో పూణే లో ఉన్న జియా లియాంగ్ సెంటర్ పై దాడులు చేసి ముగ్గురు ని అరెస్ట్ చేశామన్న ఆయన వారంతా రీకవరి కాల్ సెంటర్ గా నడిపిస్తున్నారని అన్నారు. పూణే కేంద్రంగా ఈ కాల్ సెంటర్ ను నడిపిస్తున్నారని, పూణే కేసులో మరింత దర్యాప్తు చేయగా వీరి వెనుక ఉన్న ఇద్దరు ప్రధాన సూత్ర దారులను పట్టుకున్నామని అన్నారు. హీ జియాన్ అలియాస్ మార్క్, చైనా దేశస్తుడితో పాటు వివేక్ కుమార్  ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి ని అరెస్ట్ చేశామని అన్నారు. 1.అజయ్ సొల్యూషన్ pvt, ltd, 2.బియాన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 3.ఈపోచ్ గో క్రెడిట్ సొల్యూషన్, 4.తృతీగ్ ఫిట్ టెక్ pvt ltd..అనే కాల్ సెంటర్స్ ద్వారా ఆన్ లైన్ లోన్ తీసుకున్న వారిని మానసికంగా వేధిస్తున్నారని అన్నారు.

వీరి వద్ద నుండి 4 ల్యాప్ ట్యాప్స్, 2 మొబైల్ ఫోన్స్, 1 ఐ పాడ్, రూటర్స్, డెబిట్ కార్డ్స్, స్టామ్స్ 03,పాస్ పోర్టుల ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అంతే కాక అజయ్ సొల్యూషన్ సంస్థ కు చెందిన బ్యాంకు అకౌంట్ లో ఉన్న 28 కోట్ల రూపాయల ను ఫ్రీజ్ చేశామని ఇప్పటి వరకు మొత్తం 31 కోట్లు సీజ్ చేశామని అన్నారు.  బిజినెస్ వీసా మీద వచ్చి ఇక్కడ హీజియాన్ ఇలాంటి దందాలు కొనసాగిస్తున్నాడని అన్నారు. అంకుర్ సింగ్ ఇండియా కు చెందిన వ్యక్తి.. ఇతను  ఈ కంపెనీ లో పనిచేశారని, చైనాకు చెందిన నాలుగు కంపెనీలు మొత్తం 24 ఆన్ లైన్ లోన్ యాప్స్ లను రూపొందించాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి లోన్ యాప్స్ లో లోన్ తీసుకుని చాలా మంది చనిపోతున్నారని అన్నారు. ఇలాంటి లోన్ యాప్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బాధితులు తమ కేసును టేకాఫ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారని అన్నారు.