బాబ్రీ తీర్పుపై అద్వానీ స్పందన ఇదే... 

బాబ్రీ తీర్పుపై అద్వానీ స్పందన ఇదే... 

బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించిన తీర్పును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు వెలువరించిందని.  ఈకేసులో నిందితులందరిని నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.  కోర్టు తీర్పుపై ఎల్కే అద్వానీ స్పందించారు.  ఈ కేసులో తీర్పు మహాత్మపూర్వకమైన తీర్పు అని, ఈ తీర్పును అందరూ స్వాగతించాలని అన్నారు.  ఈ కేసులో మొత్తం 49 మందిపై అభియోగాలు మోపగా, అందులో 17 మంది అప్పటికే మరణించారు.  మిగిలిన 32 మందిలో ఎల్కే అద్వానీ ఒకరు కావడం విశేషం.  ఈ కేసులో ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి, ఎక్కువ ఒత్తిడి గురైన వ్యక్తి కూడా అద్వానీ అనే చెప్పాలి.  బాబ్రీ మసీద్ వివాదం కారణంగానే 2014లో బీజేపీ ప్రధాని రేస్ నుంచి అద్వానీ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.  అంతేకాదు, రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. బాబ్రీ కేసు నుంచి ఊరట లభించడంతో అద్వానీ తిరిగి రాజకీయంగా క్రియాశీలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు నేతలు.