ఏపీలో ఆ ఐదు రోజులు మద్యం అమ్మకాలు బంద్.. 

ఏపీలో ఆ ఐదు రోజులు మద్యం అమ్మకాలు బంద్.. 

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి.  కాగా, మార్చి 10 వ తేదీన మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  మార్చి 10 వ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 48 గంటల ముందే మద్యం దుకాణాలు బంద్ కాబోతున్నాయి.  అంటే మార్చి 8,9,10 తేదీల్లో మద్యం అందుబాటులో ఉండదు.  ఇక మార్చి 14 వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉంటాయి.  కాబట్టి మార్చి 13 నుంచే మద్యం దుకాణాలు బంద్ అవుతాయి.  మార్చి 13, 14 తేదీల్లో మద్యం దుకాణాలు తెరుచుకోకపోవచ్చు.  మొత్తంగా రాష్ట్రంలో ఐదు రోజులపాటు మద్యం దుకాణాలు అందుబాటులో ఉండకపోవచ్చు.  మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.