రోనాల్డోను ను వెనక్కి నెట్టిన మెస్సీ...

రోనాల్డోను ను వెనక్కి నెట్టిన మెస్సీ...

ప్రస్తుత ఫుట్ బాల్ ఆటగాళ్లలో పోర్చుగీస్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో, బార్సిలోనా స్టార్ లియోనెల్  మెస్సీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆటలో  ​​రోనాల్డో, మెస్సీ ఒకరి మీద మరొకరు పై చేయి సాధిస్తూనే ఉంటారు. కానీ ఒక విషయంలో మాత్రం ఎప్పుడు మెస్సీ రోనాల్డో కంటే ఒక అడుగు వెనుక ఉంటాడు. కానీ ఇప్పుడు అందులో కూడా రోనాల్డోను ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి వచ్చేసాడు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యధిక ఆదాయం అందుకున్న ఫుట్‌బాల్ ఆటగాళ్లలో 922 కోట్లతో మెస్సీ మొదటి స్థానంలో నిలవగా 856 కోట్లతో రోనాల్డో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆ తర్వాతి స్థానం లో పిఎస్‌జి యొక్క స్టార్ నేమార్ 703 కోట్లతో మూడో స్థానం లో నిలిచాడు. ఇక ఈ మధ్యే బార్సిలోనా  జట్టును వదిలిపెడుతున్నట్లు చెప్పిన మెస్సీ కి ఆ జట్టు యాజమాన్యం షాక్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం మెస్సీ జట్టును వీడాలంటే 700 మిలియన్‌ యూరోలు అంటే 6 వేల కోట్లు చెల్లించాలి అని అప్పుడే తాము మెస్సీతో ఉన్న కాంట్రాక్టును రద్దు చేస్తామని బార్సిలోనా స్పష్టం చేసింది. ఈ విషయం పై మొదట మెస్సీ వాదించిన తర్వాత నేను బార్సిలోనా తోనే ఉంటాను అని స్పష్టం చేసాడు.