పింక్‌ వాట్సాప్... లింక్ క్లిక్ చేస్తే అంతే..!

పింక్‌ వాట్సాప్... లింక్ క్లిక్ చేస్తే అంతే..!

సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఏది వైర‌ల్..? ఏది రియ‌ల్ ? తెలియ‌ని ప‌రిస్థితి.. ఏకంగా ఫేక్ యాప్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.. ఇక ఆఫ‌ర్లు, తాజా అప్‌డేట్ల పేరుతో లింక్‌లు కొద‌వే లేదు.. వాటిని చూసి వెంట‌నే క్లిక్ చేసి.. కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకునే వారి సంఖ్య కూడా క్ర‌మంగా పెరిగిపోతోంది.. తాజాగా.. పింక్ వాట్సాప్ సందేశం ఒక్క‌టి వైర‌ల్‌గా మారిపోయింది.. అత్యాధునిక ఫీచర్ల కోసం ‘పింక్‌ వాట్సాప్‌’ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సందేశం.. ఇప్పుడు ఏ వాట్సాప్ గ్రూప్‌లో చూసిన ద‌ర్శ‌నం ఇస్తుంది.. వాట్సాప్‌ పింక్‌ #WhatsappPink పేరుతో సోష‌ల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఈ లింక్.. తెలిసితెలియ చాలా మంది దీనిని షేర్ చేస్తూనే ఉన్నారు.. క్లిక్ చేస్తూనే ఉన్నారు.. 

అయితే, పింక్ వాట్సాప్ యాప్ పై హెచ్చ‌రిస్తున్నారు సైబ‌ర్ నిపుణులు.. పొర‌పాటును పింక్ వాట్సాప్ లింక్‌ను క్లిక్ చేశారంటే.. మీ ఫోన్‌లోని ఫొటోలు, సందేశాలు, కాంటాక్ట్స్‌ వంటి స‌మాచారం స‌ర్వం సైబర్‌ కేటుగాళ్ల చేతికి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు.. కేవ‌లం, వాట్సాప్‌ అధికారిక యాప్‌ను మాత్ర‌మే గూగుల్‌ ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని.. కానీ, ఇలాంటి లింక్‌ల జోలికి వెళ్లొద్ద‌ని వార్నింగ్ ఇస్తున్నారు.