ఆదిలాబాద్ లో మరో కొత్త వ్యాధి... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక... 

ఆదిలాబాద్ లో మరో కొత్త వ్యాధి... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక... 

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.  కరోనా నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.  ఈ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో మరో రోగం వ్యాధి పుట్టుకొచ్చింది.  పచ్చకామెర్ల తరహాలో ఉండే లెప్టోస్పీరోసీస్ అనే  వ్యాధిని ఆదిలాబాద్ జిల్లాలో గుర్తించారు.  ఇది భయపెట్టేంత పెద్ద వ్యాధి కాదని, కాకపొతే సకాలంలో గుర్తించి వైద్యం అందించాలని వైద్యాధికారులు చెప్తున్నారు.  

ఈ వ్యాధి సోకినవారికి కళ్ళు పచ్చగా మారతాయని, దానిని పచ్చకామెర్లు అనుకుంటే పొరపాటే అని, ఆలస్యం చేస్తే కిడ్నీలు, లివర్ పై ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు.  ఎలుకలు, పిల్లులు,  కుక్కల మూత్రం ద్వారా ఈ వ్యాధి సోకుతున్నట్టు వైద్యులు గుర్తించారు.  ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, చలి వంటివి కలుగుతాయని, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.