బావిలో పడ్డ చిరుత.. టెన్షన్ లో అధికారులు !

బావిలో పడ్డ చిరుత..  టెన్షన్ లో అధికారులు !

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటవీ ప్రాంతం నుంచి పొలాల్లోకి వచ్చిన చిరుత పులి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడింది. ఆ గ్రామం చుట్టూ అటవీప్రాంతం వుండటం తో వన్యప్రాణులను వేటాడే ప్రయత్నంలో ఓ చిరుత వ్యవసాయ బావిలో పడిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో నిన్న రాత్రి లో చిరుతపులి ఆహారం కోసం వచ్చి గ్రామాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ పాఠశాల పక్కన దాదాపు 40 అడుగుల లోతులో ఉన్న వ్యవసాయ బావిలో పడింది. ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు పట్టడానికి వచ్చిన రైతు బావిలో పడ్డ చిరుతపులి గమనించడంతో బావిలో ఓ మూలన నక్కింది. దీంతో చిరుత బావిలో పడ్డ విషయాన్ని సర్పంచ్ కు తెలపడంతో, విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చేరుకొని బావిలో ఉన్న చిరుత ను తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించినా, సఫలం కాకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.