తిరుమలలో చిరుత కలకలం..వాహనదారులపై దాడి..!

తిరుమలలో చిరుత కలకలం..వాహనదారులపై దాడి..!

తిరుమలలో చిరుత కలకలం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులపై దాడికి దిగింది. ఒకేరోజు వరుసగా మూడుసార్లు దాడికి యత్నించింది. బైక్ పై వెళుతున్న వారిపై చిరుత ఒక్కసారిగా దాడికి దిగటంతో వారు తృటిలో తప్పించుకున్నారు. కరోనా ఎఫెక్ట్ తో భక్తుల తాకిడి లేకపోవటంతో జంతువులన్నీ రోడ్లపైకి వస్తున్నాయి. క్రూర మృగాలు సైతం రోడ్లపైకి వస్తుండటంతో టీటీడీ అధికారుల్లో ఆందోళన నెలకొంది. అటువైపు వెళ్లేందుకు భక్తులు కూడా భయపడుతున్నారు. మరోవైపు తాజాగా చిరుత తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్డులో ప్రత్యక్షమైంది. అలిపిరి టోల్ గేట్ కు నాలుగు కిలోమీటర్ ల దూరంలో బైక్ పై ప్రయాణిస్తున్న వారిపై దాడి చేయగా వారు తప్పించుకుని తిరుమల చేరుకున్నారు. తరవాత కొద్ది దూరంలో కూర్చుని మరో రెండు వాహనాలపైకి దాడికి యత్నించింది. అయితే గతంలో జింకలు,కుక్కలు,పందులపై చిరుత దాడి చేసింది కానీ ఎప్పుడూ మనుషులపైకి దాడికి యత్నించలేదు.