నెల్లూరులో అమ్మాయిలను ట్రాప్ చేసిన లెక్చరర్..ఆ తర్వాత...!

నెల్లూరులో అమ్మాయిలను ట్రాప్ చేసిన లెక్చరర్..ఆ తర్వాత...!

నెల్లూరు జిల్లాలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ఓ మాయగాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. వింజమూరుకు చెందిన ప్రశాంత్ ఓ ప్రైవేట్ కళశాలలో లెక్చరర్‌గా చేస్తున్నాడు. టీచింగ్ స్కిల్స్ తో పాటు అయ్యవారికి వక్ర బుద్దులు కూడా మెండు.

నెల్లూరు జిల్లా వింజమూరులో ఓ‌ అమ్మాయితో ప్రేమ కలపాలు సాగిస్తూ.. ఆమె ద్వారా ఫ్రెండ్ నెంబర్ తీసుకుని ఆమెను కూడా ట్రాప్‌లో వేశాడు. అలా అమ్మాయిల నెంబర్లు వరుసగా తీసుకుని.. ట్రాప్‌ చేసి వాళ్లను బ్లాక్‌మెయిల్ చేస్తుండే వాడు. ఇలా ఇప్పటి వరకు 15 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు ఈ ప్రబుద్ధుడు. ఓ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో దిశ పోలీసులు వాడి ఆట కట్టించి, కటకటాల వెనక్కి నెట్టారు.