ఎల్డీఎఫ్ కీల‌క భేటీ.. అక్క‌డే అన్నీ నిర్ణ‌యం..!

ఎల్డీఎఫ్ కీల‌క భేటీ.. అక్క‌డే అన్నీ నిర్ణ‌యం..!

తాజాగా వెల్ల‌డైన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత‌ప్రాంతంలోని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. కేర‌ళ తిరుగులేని విజ‌యాన్ని అందుకుంది లెఫ్ట్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్‌)... దీంతో.. వ‌రుస‌గా రెండోసారి సీఎం పీఠాన్ని త‌న ఖాతాలో వేసుకుని ఎన్డీఎఫ్ కొత్త రికార్డు సృష్టించింది.. ఇప్ప‌టికే కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుకు నైన్ క్లియ‌ర్ చేస్తూ.. సీఎం ప‌ద‌వికి పిన‌ర‌యి విజ‌య‌న్ రాజీనామా చేయ‌గా.. మ‌రోసారి ఆయ‌నే కేర‌ళ పీఠాన్ని అధిష్టించ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు బ‌లంగా ఉన్నాయి... అయితే, అంత‌కు ముందు కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది ఎల్డీఎఫ్.. రెండు వారాల్లో కూటమిలోని అన్ని పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి ఈ నెల 17న ఎల్టీఎఫ్ తుది స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.. మంత్రిత్వ శాఖ‌ల కేటాయింపు, ప్ర‌భుత్వ ఏర్పాటు ముహూర్తం, ప్ర‌మాణ స్వీకార తేదీ త‌దిత‌ర అంశాల‌పై ఈ భేటీలోనే తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు ఎన్డీఎఫ్ క‌న్వీన‌ర్, సీపీఎం యాక్టింగ్ స్టేట్ సెక్రెట‌రీ విజ‌య‌రాఘ‌వ‌న్.. దీంతో.. ఈ నెల 17న జ‌ర‌గ‌నున్న భేటీకి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.