బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. అయితే, ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడింది.. మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వలన అదే ప్రాంతములో ఇవాళ ఉదయం 08.30 గంటలకు అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ప్రారంభంలో ఇది రాగల 48 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 3 రోజులలో ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. తూర్పు-పశ్చిమ ద్రోణి వెంబడి పెనిన్సులర్ భారతదేశం మరియు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధముగా కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం మీదుగా 1.5 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉందని వెల్లడించారు.