ప్రభుత్వం నో చెప్పడంతో... లంక ప్రీమియర్ లీగ్ వాయిదా 

ప్రభుత్వం నో చెప్పడంతో... లంక ప్రీమియర్ లీగ్ వాయిదా 

కరోనా కారణంగా వాయిదా పడిన శ్రీలంక ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 20 వరకూ నిర్వహించనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అయితే మార్చి 29 న జరగాల్సిన ఐపీఎల్ సెప్టెంబరు 26 నుంచి నవంబరు 10 వరకూ జరుగుతుంది అని బీసీసీఐ తెలిపింది. ఈ ప్రకటనతో ఆటగాళ్లకు ఇబ్బంది కలగకుండా తమ కొత్త షెడ్యూల్ శ్రీలంక బోర్డు ప్రకటించింది. అయితే ఈ లీగ్ లో పాల్గొనే ఆటగాళ్లు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. కానీ ఆ క్వారంటైన్ సమయాన్ని 7 రోజులకు తగ్గించాలని బోర్డు లంక ప్రభుత్వాని విజ్ఞప్తి చేసింది. కానీ దానికి ప్రభుత్వం నో చెప్పింది. మొత్తం ఐదు జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 70 కి పైగా విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు అని లంక బోర్డు తెలిపింది. ఇక లీగ్ ప్రారంభానికి ఇంకా 16 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇప్పటికి చాల మంది విదేశీ ఆటగాళ్లు లంకకు చేరుకోలేదు. దాంతో చేసేదేమి లేక ఈ లీగ్ ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఐపీఎల్ ముగిసిన తర్వాత నవంబరు 20 నుంచి డిసెంబరు 12 వరకు లంక ప్రీమియర్ లీగ్‌ని నిర్వహించేందుకు చూస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దాంతో శ్రీలంక ఆటగాళ్లు లసిత్ మలింగ, ఇసురు ఉదాన ఐపీఎల్ ఆరంభం నుండి అందుబాటులో ఉండనున్నారు.