టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగు చెయ్యలేరు : లక్ష్మీ పార్వతీ

టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగు చెయ్యలేరు : లక్ష్మీ పార్వతీ

వైయస్సార్ కాంగ్రెస్ తరపున మంచి యువకుడు అభ్యర్థి గా నిలబెట్టారు. కాబట్టి భారీ మెజారిటీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి ని గెలిపించాలి అని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతీ అన్నారు. లోకేష్ ఏమి మాట్లాడుతారో అర్థం కాదు. తెలుగు దేశం అభ్యర్థి గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధర తగ్గిస్తామని అంటారు, కనీస అవగాహన కూడా నారా లోకేష్ కి లేదు. నారా లోకేష్ ని చూసి అందరు నవ్వు కుంటున్నారు‌ అని చెప్పిన ఆవిడ కనీస ఓటు బ్యాంకు లేని బీజేపీ మిమే గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. బ్రాహ్మణులకు వంశపారంపర్యంగా కొనసాగించి, ఇచ్చిన హామి నిలబెట్టుకున్నారు  సీయం జగన్. ఇక పులివెందులపై పవణ్ కళ్యాణ్ మాటలు చాలా దారుణం. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన ఊరు పులివెందుల. అలాంటి ఊరిపై దుర్భాషలాడడం పవన్ కళ్యాణ్ దిగజారుడు తనానికి నిదర్శనం. చిరంజీవి ఎన్నడు నోరు జార లేదు, అలాంటి వారికి తమ్ముడు గా ఉన్న నీకు ఎందుకు నోరు దురద అని ప్రశ్నించారు. మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ ఇంకా చిన్న పిల్లోడు కాదు , 60 సంవత్సరాలకు దగ్గర లో ఉన్నాడు అని అన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ ని జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన బాగు చెయ్యలేరు. ఆ స్థాయికి పార్టీ భూస్థాపితం చేసాడు చంద్రబాబు అని పేర్కొన్నారు.