లేడీ సూపర్ స్టార్ కు ఆ దర్శకుడంటే ఎందుకు పడదో...
నయనతార సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నది. శ్రీరామరాజ్యం సినిమా ముందు వరకు నయనతార కేవలం హీరోయిన్ గా మాత్రమే చేసింది. ఎప్పుడైతే ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యిందో అప్పటి నుంచి మొత్తం మారిపోయింది. బ్రేకప్ తరువాత ఈ అమ్మడు తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. స్టార్ హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.
అయితే, ఏ అమ్మడికి మురుగదాస్ అంటే ఎందుకో పడదు. గతంలో మురుగదాస్ గురించి కొన్ని కామెంట్లు చేసింది. అయినా మురుగదాస్ ఆమెకు దర్బార్ లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ మూడు రూ. 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో నయనతార పాత్ర చిన్నదే. పెద్దగా ఇంపార్టెన్స్ కూడా లేదు. దీంతో నయనతార మరోసారి మురుగదాస్ పై ఫైర్ అయ్యింది. మురుగదాస్ మాత్రం పాత్రకు అవసరాన్ని బట్టి ఉంటుందని అన్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో నయనతార వర్సెస్ మురుగదాస్ గా నడుస్తున్నది. ఇది ఎలాంటి మార్పులకు, పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)