త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలు : మల్లారెడ్డి

త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలు : మల్లారెడ్డి

మేడ్చెల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో రూ.3 కోట్ల 60 లక్షలతో పలు అభివృద్ధి పనులకు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ....పేద ప్రజల సంక్షేమంకోసం త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు.  పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమని కొనియాడారు. అక్రమార్కుల చేతుల్లో సామాన్య ప్రజలు తమ భూములను కోల్పోకుండా కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్నితీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్యాణలక్ష్మీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, టీఆర్ఎస్ నేత మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.