అయోధ్య రామాలయానికి ఎల్ అండ్ టి బంపర్ అఫర్... 

అయోధ్య రామాలయానికి ఎల్ అండ్ టి బంపర్ అఫర్... 

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది ప్రభుత్వం.  అయోధ్య రామాలయ ట్రస్ట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఈ ట్రస్ట్ కు ఆలయ బాధ్యతలు అప్పగించబోతున్నది.  అయితే, ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే దేశంలోని వేలాదిమంది విరాళాలు ఇస్తున్నారు.  ఇదిలా ఉంటె, దేశంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి ఓ అఫర్ ను ప్రకటించింది.  

అయోధ్య నిర్మాణం డిజైన్ నుంచి దాని నిర్మాణం మొత్తాన్ని ఉచితంగా చేసేందుకు సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.  అయితే, దీనికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయబోదని తెలుస్తోంది.  ఉచితంగా చేస్తామని మాత్రం చెప్తున్నది.  ఈ విషయంపై విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ బోర్డు సభ్యుడు చంపత్ రాయ్ ఎల్ అండ్ టి తో చర్చలు జరుపుతున్నారు.  త్వరలోనే దీనికి సంబంధించిన విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది.