బెంగుళూరుపై పంజాబ్ ఘనవిజయం...!

బెంగుళూరుపై పంజాబ్ ఘనవిజయం...!

దుబాయ్ వేదికగా ఐపీఎల్2020 కొనసాగుతోంది. నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు పై పంజాబ్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్ లో పంజాబ్ జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ తో బెంగుళూరుకు చెమటలు పట్టించాడు. 69 బంతుల్లో 132 పరుగులు సాధించాడు. వాటిలో 14ఫోర్లు,7సిక్సులు బాదాడు. ఇక లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు 20 ఓవర్లలో 109 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. బెంగుళూరు జట్టులో వాషింగ్ టన్ సుందర్ 27 బంతుల్లో 30 పరుగులు తీసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.