ఐపీఎల్ వేలం ముందు ఫ్రాంచైజీలకు షాక్ ఇచ్చిన బీసీసీఐ...

ఐపీఎల్ వేలం ముందు ఫ్రాంచైజీలకు షాక్ ఇచ్చిన బీసీసీఐ...

రేపు చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 కోసం బీసీసీఐ మినీ వేలంను నిర్వహించనుంది. అయితే ఈ వేలానికి ముందు బీసీసీఐ ఓ కొత్త నిబంధను తీసుకొచ్చింది. ప్రతి జట్టు ఆటగాళ్ల కొనుగోలుకు మొత్తం 85 కోట్లు ఉంటాయి. ఏ ఫ్రాంఛైజీ కూడా తన వద్ద ఉన్న మొత్తంను గత కొన్ని సీజన్లుగా పూర్తిగా ఖర్చు చేయడం లేదు. ఆ కారణంగా ఈ కొత్త నిబంధన తెచ్చింది బీసీసీఐ. ఫ్రాంఛైజీ వద్ద ఉండే మొత్తంలో తప్పకుండ 75 శాతం ఖర్చు చేయాలని, లేకపోతే మిగిలిన డబ్బులు బీసీసీఐ ఖాతాలోకి వెళ్తాయి. అయితే ఈసారి ఐపీఎల్‌ వేలంలో పాల్గొననున్న ఫ్రాంచైజీల్లో కింగ్స్‌ పంజాబ్‌ వద్ద అత్యధికంగా రూ. 53.2 కోట్లు ఉన్నాయి. అయితే ఈ నిబంధన ప్రకారం పంజాబ్ రేపు జరిగే వేలంలో కనీసం 31.7 కోట్లు  ఖర్చు చేయాల్సి ఉంది. చూడాలి మరి రేపు వేలంలో ఏం జరుగుతుంది అనేది.