కోహ్లీ తిడతాడని ఆ పని చేయలేదు : కుల్దీప్‌ 

కోహ్లీ తిడతాడని ఆ పని చేయలేదు : కుల్దీప్‌ 

భారత‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 2017 లో కొన్ని నెలల వ్యవధిలోనే క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసాడు. ఇక తాజాగా అతను మొదటి టెస్ట్ మ్యాచ్ ముందు తన పరిస్థితి ఎలా ఉంది అనేది ఓ వీడియో విడుదల చేస్తూ తెలిపాడు. అందులో ''నా మొదటి టెస్ట్ 2017 లో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా ఆడాను. అందులో నా మొదటి మ్యాచ్ ముందు రోజు మా కోచ్ అనిల్ కుంబ్లే నా దగ్గరకు వచ్చి నువ్వు రేపు 5 వికెట్లు సాధించాలి అని తెలిపాడు. ఇక ఆ రోజు త్వరగా నిద్రపోయాను. అందుకే ఉదయం 3 గంటలకే  మెళుకువ వచ్చింది. ఆ సమయంలో నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. అయితే అప్పుడు కోహ్లీ నా పక్క రూమ్ లోనే ఉన్నాడు. అతని వద్దకు వెళ్లి మాట్లాడాలి అనుకున్నాను. కానీ అంత ఉదయానే వెళ్లి లేపితే తిడతాడని అనుకోని ఆ పని చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ నా రూమ్ కి వెళ్లి పడుకొని ఆరుగంటలకు లేచాను. త్వరగా టిఫిన్ చేసి గ్రౌండ్ లోకి వెళ్ళాను. ఆ క్షణంలో చిరకాలం స్వప్నం నేరవేరినందుకు సంతోషం, ఒత్తిడి, భావోద్వేగానికి లోనయ్యాను'' అని కుల్దీప్‌ చెప్పాడు. ఇక తన తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులిచ్చి 4 వికేట్లు పడగొట్టాడు ఈ యువ స్పిన్నర్.