రామలింగారెడ్డి అంత్యక్రియలకు కేటీఆర్

రామలింగారెడ్డి అంత్యక్రియలకు కేటీఆర్

రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామం అయిన దుబ్బాక లోని చిట్టాపూర్ లో ఈరోజు మద్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం జరగనున్న రామలింగారెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్న తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కే తారకరామారావు హాజరు కానున్నారని చెబుతున్నారు. మధ్యాహ్నం 1.30 కి రామలింగ రెడ్డి భౌతిక కాయనికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నట్టు చెబుతున్నారు. ఇక ఇప్పటికే దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు కలెక్టర్ వెంకటరామిరెడ్డి అర్పించారు.