ఐపీఎల్‌ మ్యాచ్‌లపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌..

ఐపీఎల్‌ మ్యాచ్‌లపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌..

కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ దుబాయ్‌ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. అయితే... ఈ సారి ఈ బిగ్‌ లీగ్‌ మన దేశంలోనే జరుగనుంది.  అయితే.. ఈ సంవత్సరం జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికల జాబితాలో హైదరాబాద్‌ లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లను చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, బెంగళూరు, ఢిల్లీలలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ దీనిపై స్పందించారు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు హైదరాబాద్‌ను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ, ఐపీఎల్‌ ప్రతినిధులను ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ కోరారు. తమ దగ్గర కరోనా ప్రభావం అధికంగా లేదనడానికి ఇక్కడ నమోదవుతున్న తక్కువ కేసులే నిదర్శనమని ట్వీట్‌ లో పేర్కొన్నారు. మిగిలిన మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో కేసులు తక్కువల అని... ఐపీఎల్‌ మ్యాచ్‌లకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు సంపూర్ణంగా ఉంటుందని వెల్లడించారు మంత్రి కేటీఆర్‌. అయితే.. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు బీసీసీఐ, ఐపీఎల్‌ యాజమాన్యం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.