వాళ్లు చుక్కలు చూపితే.. మేం చెక్కులు చూపిస్తున్నాం

వాళ్లు చుక్కలు చూపితే.. మేం చెక్కులు చూపిస్తున్నాం

గత ప్రభుత్వాలు రైతులకు చుక్కలు చూపితే.. తాము చెక్కులు చూపిస్తున్నాం అన్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అనుమానాలు.. అవమానాల మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రయాణం మొదలైందని.. ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్‌కు దిక్కులేదు.. నీళ్ల విషయంలో న్యాయం జరగలేదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ముదిగొండలో.. టీడీపీ ప్రభుత్వం బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాలు రాబందులైతే.. మనం రైతు బంధులం.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం.. ఎకరానికి 8 వేల రూపాయలు ఇచ్చే విప్లవాత్మకమైన పథకాన్ని రేపు ప్రారంభిస్తున్నాం.. దేశంలో మరో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్రం అవుతుందన్న నమ్మకం నాకు ఉంది.