మ‌హేష్ నాయికకు భారీ ఆఫ‌ర్‌

మ‌హేష్ నాయికకు భారీ ఆఫ‌ర్‌

అందాల క‌థానాయిక కృతిస‌నోన్ ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. మ‌హేష్ స‌ర‌స‌న‌ `1-నేనొక్క‌డినే` చిత్రంలో న‌టించింది. మ‌హేష్‌తో పోటీప‌డుతూ న‌టించి మెప్పించింది. 1నేనొక్క‌డినే ఫ‌లితంతో సంబంధం లేకుండా కృతి న‌ట‌న‌కు పేరొచ్చింది. ఆ త‌ర‌వాత నాగ‌చైత‌న్య స‌ర‌స‌న దోచేయ్ చిత్రంలో న‌టించింది. అటుపై బాలీవుడ్‌లో ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించిన కృతి.. ప్ర‌స్తుతం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు దూరంగానే ఉంది. 

తాజాగా ఈ భామ ఓ భారీ బ‌డ్జెట్‌ చిత్రంలో క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుంది. `మొహంజోదారో` ఫేం అశుతోష్ గోవారిక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమా చారిత్రాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. చరిత్ర‌లో పానిప‌ట్ యుద్ధం ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి `క‌లాంక్‌` అనే టైటిల్‌ని నిర్ణ‌యించారు. ఈ చిత్రంలో కృతి స‌ర‌స‌న ఆదిత్య‌రాయ్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇదే చిత్రంలో సంజ‌య్‌ద‌త్‌- మాధురి ధీక్షిత్‌, వరుణ్‌ధావ‌న్‌-ఆలియాభ‌ట్ వేరే జంట‌లుగా న‌టిస్తున్నారు. భార‌త‌దేశ సినిమా చ‌రిత్ర‌లో ఇంత‌వ‌ర‌కూ తెర‌కెక్క‌నంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ అవ‌కాశం కృతి కెరీర్‌కి అతి పెద్ద బూస్ట్ అని చెప్పాలి.