గిరిజ‌నుల‌పై ఎందుకింత చిన్న‌చూపు : కేసీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్

గిరిజ‌నుల‌పై ఎందుకింత చిన్న‌చూపు : కేసీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్

సీఎం కేసీఆర్‌పై భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఫైర్‌ అయ్యారు.  మ‌డ‌మ తిప్పని కేసీఆర్... నీ మాట‌కు విలువ ఇదేనా అని ప్రశ్నించారు.  అట‌వీ త‌ల్లిని న‌మ్ముకున్న గిరిజ‌నుల‌పై ఎందుకింత చిన్న‌చూపు అని నిలదీశారు.  పొట్ట‌కూటి కోసం పోడు భూముల్లో వ్య‌వ‌సాయం చేస్తే అక్ర‌మ కేసులా...? గిరిజ‌న స‌మస్య‌ల‌పై కేంద్ర  చ‌ర్చ‌లు ఎందుకు జ‌ర‌ప‌లేదని మండిపడ్డారు.  యావ‌త్ గిరిజ‌నుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి కేసులు వెన‌క్కి తీసుకోవాలని.. లేదంటే కోమురం భీమ్ స్పూర్తిగా పోరాటం త‌ప్ప‌దని హెచ్చరించారు. గత 70 సంవత్సరాలుగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటూ బ‌తుకు వెళ్ల‌దీస్తున్న గిరిజ‌న‌‌ రైతులపై అటవీ అధికారులు దౌర్జన్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని వెల్ల‌డించారు. అసెంబ్లీ సాక్షిగా పోడుభూములపై గిరిజన రైతులకు హక్కులు కల్పిచేందుకు  కేంద్రప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.  గిరిజ‌నులపై అక్ర‌మ కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారని మండిప‌డ్డారు.