ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్..

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్..

ఐపీఎల్ 2020 లో ఈ రోజు 5వ మ్యాచ్ కోల్‌కత నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కత కెప్టెన్ దినేష్ కార్తీక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే రోహిత్ మాట్లాడుతూ... గతంలో ఏం జరిగిందన్నది వదిలేస్తే అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు మేము చేయము అని తెలిపాడు. ఇక నైట్ రైడర్స్ కు మొదటి మ్యాచ్ ఇదే కాగా ముంబై మాత్రం తమ మొదటి మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడిపోయి ఈ రెండో మ్యాచ్ ను ఎలాగైనా గెలవాలని చూస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

కేకేఆర్ జట్టు : సునీల్ నరైన్, షుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్(wk/c), నిఖిల్ నాయక్, పాట్ కమ్మిన్స్, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, శివం మావి

ముంబై జట్టు : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (wk), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా