ఐపీఎల్ 2020 : ఢిల్లీకి షాక్ ఇచ్చిన కేకేఆర్...

ఐపీఎల్ 2020 : ఢిల్లీకి షాక్ ఇచ్చిన కేకేఆర్...

ఈ రోజు ఐపీఎల్ 2020 లో దుబాయ్ వేదికగా మొదటి మ్యాచ్ కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ కోల్‌కత బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేయలేకపోయింది. కేకేఆర్ ఓపెనర్ నితీష్ రానా(81), సునీల్ నరైన్ (64) అర్ధశతకాలతో రాణించడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఒక తర్వాత 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఢిల్లీ కి కోల్‌కత బౌలర్లు షాక్ ఇచ్చారు. జట్టు ఓపెనర్ రహానే మొదటి ఓవర్ మొదటి బంతికే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ వెంటనే 6 పరుగులు చేసి ధావన్ కూడా ఔట్ అయ్యాడు. కానీ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (47), రిషబ్ పంత్ (27) ఇన్నింగ్స్ చక్కదిదే ప్రయత్నం చేసారు. కానీ వారిని వరుస ఓవర్లలో బౌలర్ వరుణ్ చక్రవర్తి బోల్తా కొట్టించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వచ్చినవారు వచ్చినట్లు  వెనుదిరగడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులు చేసింది. దాంతో కేకేఆర్ 59 పరుగుల తేడాతో ఈ ఏడాది ఐపీఎల్ లో 6వ విజయాన్ని నమోదుచేసి పాయింట్ల పట్టికలో తమ 4వ స్థానాన్ని కాపాడుకుంది.