ఐపీఎల్ 2020 : ఒక్క మ్యాచ్.. రెండు చెత్త రికార్డులు...

ఐపీఎల్ 2020 : ఒక్క మ్యాచ్.. రెండు చెత్త రికార్డులు...

ఐపీఎల్ 2020 లో నిన్న కోల్‌కత నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లు కేకేఆర్ బ్యాట్స్మెన్స్ ను ముప్పుతిప్పలు పెట్టారు. మన హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ 4 ఓవర్లలో రెండు మేడిన్ ఓవర్లు  కావడం గమనార్హం. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు మాత్రమే చేసింది కోల్‌కత. ఆ తర్వాత 85 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు తొందరపడకుండా నిదానంగా 13.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి చేధించింది.

అయితే ఈ ఒక్క మ్యాచ్ లోనే కోల్‌కత నైట్ రైడర్స్ రెండు చెత్త రికార్డులను తమ పేరిట నమోదుచేసింది. అందులో మొదటిది... ఐపీఎల్ లో ఇప్పటివరకు పవర్ ప్లేలో అతితక్కువ పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. హైదరాబాద్‌-21/3 తో ఇన్ని రోజులు మొదటి స్థానంలో ఉంటె ఈ మ్యాచ్ లో కేకేఆర్ 17/4 తో మొదటి స్థానానికి వచ్చింది. ఇక రెండో చెత్త రికార్డు ఏంటంటే... ఐపీఎల్ లో మొత్తం 20 ఓవర్లు ఆడి తక్కువ పరుగులు చేసిన జట్టు కోల్‌కత. ఈ మ్యాచ్ లో కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఇంతకముందు ఈ చెత్త రికార్డు పంజాబ్‌ ''8 వికెట్లను 92 పరుగులు'' పేరుమీద ఉండేది. ఇక ఈ మ్యాచ్ లో విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వెళ్ళింది.