ఐపీఎల్ 2021 : కోల్‌కత ముందు కొండంత లక్ష్యం...

ఐపీఎల్ 2021 : కోల్‌కత ముందు కొండంత లక్ష్యం...

డబల్ హెడర్ సందర్బంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై కోల్‌కత ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. మొదట చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (64) అర్ధశతకంతో రాణించగా మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ 95 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. అయితే గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత బేటింగ్ కు వచ్చిన మొయిన్ అలీ(25), ధోని(17) వేగంగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ కు చేరుకున్నారు. అయిన కూడా చివరి వరకు ఉన్న డు ప్లెసిస్ మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఇక కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే కోల్‌కత 221 పరుగులు చేయాలి. అయితే స్టార్ హిట్టర్లు జట్టులో ఉన్న ఈ కొండంత లక్ష్యాన్ని కోల్‌కత ఛేదిస్తుందా... లేదా అనేది చూడాలి.