ఐపీఎల్ 2021 : ముగిసిన బెంగళూరు ఇన్నింగ్స్...

ఐపీఎల్ 2021 : ముగిసిన బెంగళూరు ఇన్నింగ్స్...

చెన్నై వేదికగా ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరుకు మొదట్లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక్కే ఓవర్లో రెండు వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాక్స్వెల్ అద్భుతంగా రాణించాడు. 49 బంతుల్లో 78 పరుగులు చేసాడు. కానీ మాక్స్వెల్ పెవిలియన్ చేరడానికి కొద్దీ సమయం ముందు క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ చివర్లో రెచ్చిపోయాడు. చివరి మూడు ఓవర్లలోనే 50కి పైగా పరుగులు చేసి మొత్తంగా 34 బంతుల్లో 76 పరుగులు చేయడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు, కమ్మిన్స్,ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే కేకేఆర్ 205 పరుగులు చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.