ఎనిమిదేళ్ల తర్వాత కేకేఆర్ మొదటిసారి...

ఎనిమిదేళ్ల తర్వాత కేకేఆర్ మొదటిసారి...

ఐపీఎల్ 2020 లో నిన్న కోల్‌కత నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(80) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు నిర్ణిత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆ తర్వాత 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కేకేఆర్ జట్టు ముంబై బౌలర్లను తట్టుకోలేక 146 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో ముంబై 49 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే రోహిత్ జట్టుకు ఈ లీగ్ లో ఇది రెండో మ్యాచ్ కాగా కేకేఆర్ కు మాత్రం మొదటి మ్యాచ్. 2008 నుండి జరుగుతున్న ఈ ఐపీఎల్ లీగ్ లో గత ఎనిమిదేళ్లలో మొదటి మ్యాచ్ ఓడిపోవడం కోల్‌కత నైట్ రైడర్స్ కు ఇదే మొదటిసారి. ఇక 2014 లో కూడా కేకేఆర్ ముంబై తోనే మొదటి మ్యాచ్ ఆడగా 41 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ సిన్ రివర్స్ అయ్యింది. ఇక కోల్‌కత నైట్ రైడర్స్ ఐపీఎల్ 2020 లో తన రెండో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈ నెల 26న ఆడనుంది.