టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

ఐపీఎల్-11లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఈ మ్యాచ్‌ ను తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కోల్‌కతా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని చూస్తుంది. రింకూ స్థానంలో నితీశ్‌ రాణా.. శివమ్‌ మావి స్థానంలో కృష్ణను జట్టులోకి తీసుకుంది కోల్‌కతా. మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది ముంబై.

జట్లు:

కోల్‌కతా: క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, శుభ్‌మాన్ గిల్, నితీష్ రానా, దినేశ్ కార్తీక్, రస్సెల్, పియూష్ చావ్లా, మిషెల్ జాన్సన్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.

ముంబై: సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లివీస్, ఇశాన్ కిషన్, రోహిత్ శర్మ, డుమినీ, హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బెన్ కట్టింగ్, మిషెల్ మెక్‌క్లాగాన్, మాయంక మార్ఖండే, జస్ప్రీత్ బుమ్రా.