ఐసీసీ పై కోహ్లీ ఆగ్రహం...

ఐసీసీ పై కోహ్లీ ఆగ్రహం...

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కమిటీపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన పర్సటైంజ్ ఆఫ్ పాయింట్స్ నిబంధనను తప్పుబట్టాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కాలంలో ఎలాంటి మ్యాచ్‌లు జరగకపోవడంతో భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే ఆధ్వర్యంలో ఐసీసీ కమిటీ పీసీటీ నిబంధనను తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం విజయాల శాతం ఆధారంగా జట్ల స్థానాలు మారుతాయి. పరిస్థితులు అదుపులో లేనప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పుడు అంతా బాగానే ఉంది.. అలాంటప్పుడు రూల్స్‌ కూడా మారాలి.. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మ్యాచ్‌లు ఓడిపోవడం.. గెలవడం సహజమే.. అయినా మేం పాయింట్ల గురించి అంతగా బాధపడడం లేదు.. అయితే కొన్ని విషయాల్లో మీరు లాజిక్‌ లేకుండా రూల్స్‌ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం ఆగ్రహం తెప్పించింది. 'అంటూ పేర్కొన్నాడు. అయితే ఇంగ్లండ్‌ తో మంగళవారం ముగిసిన ఫస్ట్ టెస్ట్‌లో భారత్ 227 పరుగులతో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. దాంతో టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్స్‌ టేబుల్లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది.