తిరుమలలో డిక్లరేషన్‌ విధానాన్ని ఎత్తివేయాలి : మంత్రి కొడాలి

తిరుమలలో డిక్లరేషన్‌ విధానాన్ని ఎత్తివేయాలి : మంత్రి కొడాలి


తిరుమలలో డిక్లరేషన్‌ విధానాన్ని ఎత్తివేయాలని అన్నారు మంత్రి కొడాలి నాని. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని మతాలవారు ఉన్నారన్న మంత్రి కొడాలి సీఎం జగన్‌  హిందువులకు మాత్రమే ప్రతినిధిగా వెళ్లడం లేదని అన్నారు. డిక్లరేషన్‌ మీద' సంతకం చేయమని అనడం నీచమైన రాజకీయం అని మంత్రి కొడాలి పేర్కొన్నారు. నిజానికి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే అన్యమతస్థులు డిక్లరేషన్ సమర్పించనవసరం లేదని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించడం వివాదాస్పదమవుతోంది.

సర్వదర్శనం క్యూ లైన్‌లో వెళ్లే అన్యమతస్థుడిని గుర్తించడం సాధ్యం కాదని సుబ్బారెడ్డి చెప్పారు. అన్యమతస్థుడికి విశ్వాసం వుంది కాబట్టే స్వామివారి దర్శనానికి వస్తూన్నారని చెప్పారు. ఈ విషయం మీద విమర్శలు రావడంతో ఆయన వెనక్కు తగ్గారు. తాను సిఎం ఒక్కరికే ఈ డిక్లరేషన్ అక్కర్లేదని చెప్పానని మీడియా వక్రీకరించిందని అన్నారు. ఇక తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానంటున్న మంత్రి కొడాలితో మా ప్రతినిధి రెహనా ఫేస్‌ టు ఫేస్‌.