రాహుల్ జోక్ పై అభిమానుల ఆగ్రహం...

రాహుల్ జోక్ పై అభిమానుల ఆగ్రహం...

ఆస్ట్రేలియా తో జరిగిన రెండు వన్డే మ్యాచ్ లలో భారత్ ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మైదానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ... వార్నర్ గాయం ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుంది అని జోక్ చేసాడు. ఆ తర్వాత నేను అలా ఏ ఆటగాడి విషయంలో అనుకోను... అతను ఆసీస్ జట్టుకు కీలకమైన ఆటగాడు. కాబట్టి ఒకవేళ అలా జరిగితే అది భారత్ కు కలిసి వస్తుంది అని అన్నాడు. ఇక తన బ్యాటింగ్ లో డాట్ బాల్స్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు. అయితే రాహుల్ వార్నర్ విషయంలో సరదాగా చెప్పిన మాటలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.