అందుకే మ్యాక్స్‌వెల్ ను‌ జట్టులో ఉంచుతున్నాము : రాహుల్

అందుకే మ్యాక్స్‌వెల్ ను‌ జట్టులో ఉంచుతున్నాము : రాహుల్

ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అనూహ్యంగా పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్ రేసులోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. మంగళవారం టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్లతో గెలుపొందింది. అయితే ఈ సీజన్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ వరుసగా విఫలమవుతున్నాడు. అయిన అతడిని పంజాబ్ ప్రతి మ్యాచ్ ఆడిస్తోంది. చివరికి ఢిల్లీ పై ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ రూ.10.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మ్యాక్స్‌వెల్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

 అయితే తాజాగా మాక్స్‌వెల్‌ను జట్టులో ఎందుకు ఆడిస్తున్నామనే దానిపై పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ క్లారీటీ ఇచ్చాడు.‌ రాహుల్‌ మాట్లాడుతూ...'గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ ప్రాక్టీస్‌ సమయంలో బాగా ఆడతాడు. బ్యాటింగ్‌ విషయంలో బాగా కష్టపడుతున్నాడు. మ్యాక్సీ మా జట్టులో ఒక అద్భుతమైన టీం మెంబర్‌గా కనిపిస్తాడు. అతను జట్టులో ఉంటే నాకు ఎందుకో మేము మంచి బ్యాలెన్స్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. జట్టులో 11 మంది సరిగ్గా ఆడడం అనేది ఎప్పటికీ జరగదు. ఫీల్డింగ్‌లోనూ అందరూ తమ వైవిధ్యమైన ఆటతీరును చూపలేరు. కానీ మ్యాచ్‌ విన్నర్లు జట్టుకు చాలా అవసరం'' అని అన్నాడు.