సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్...

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్...

భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో అలాగే ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసాడు. అందులో ఒకటి ఐపీఎల్ లో అత్యంత వేగంగా 2,000 పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా రికార్డు సాధించాడు సచిన్. కానీ ఇప్పుడు దానిని పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్రేక్ చేసాడు.  ఈ ఘనతను సచిన్ 2012 లో సాధించాడు. ఐపీఎల్ లో మొత్తం 63 ఇన్నింగ్స్ లలో సచిన్ ఈ మార్క్ అందుకోగా కేవలం 59 ఇన్నింగ్స్ లలోనే రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రాహుల్ ఈ రికార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ప్రస్తుతం పంజాబ్ 5 ఓవర్లలో 41 పరుగులు చేసింది. అందులో రాహుల్ 22 పరుగులతో కొనసాగుతున్నాడు.