ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు : రాహుల్

ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు : రాహుల్

భారత మాజీ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. అయితే ధోనీ పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తానన్నాడు. తన అవగాహన మేరకు మైదానంలో స్పిన్నర్లకు సలహాలు ఇస్తానని పేర్కొన్నాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహులే కీపింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంఎస్‌ ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఒక వికెట్‌ కీపర్ కమ్‌ బ్యాట్స్‌మన్‌ ఎలా ఉండాలో మహీ మనందరికీ చూపించాడు. అతడి నుంచే మనమెంతో నేర్చుకున్నాం. కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజాతో నాకు మంచి అవగాహన ఉంది. ఏది మంచి లెంగ్తో, ఎక్కడ బంతులు వేయాలో, ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలో నా సామర్థ్యం మేరకు వాళ్లకు సూచనలు చేస్తుంటాను. గ్లోవ్స్‌ ధరించిన ప్రతి ఒక్కరికీ ఆ బాధ్యత ఉంటుంది' అని కేఎల్ రాహుల్‌ అన్నాడు.