నా కథలన్నీ వైజాగ్ బీచ్ లో కూర్చుని రాసినవే

నా కథలన్నీ వైజాగ్ బీచ్ లో కూర్చుని రాసినవే

దర్శకుడు కిషోర్ తిరుమలతో రామ్ పోతినేనికి మంచి ర్యాపో కుదిరింది. 'నేను శైలజ' వంటి సూపర్ హిట్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది. ఆ తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ' కూడా పర్వాలేదనిపించేలా ఆడింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం 'రెడ్'. తమిళ చిత్రం తడమ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రామ్ డబల్ రోల్ లో కనిపించాడు. కిషోర్ తిరుమల మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో తీసిన చిత్రలహరి సినిమా కూడా ఇతడికి మంచి పేరు తీసుకువచ్చింది. కిషోర్ తిరుమల దర్శకుడిగా కంటే ముందు చాలా సినిమాలకు కథలు రాసాడు. ఈ కథలన్నీ వైజాగ్ బీచ్ లోనే కూర్చొని రాసినట్లుగా క్రాక్ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడాడు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.