జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడులు తగ్గుముఖం... స్పష్టం చేసిన హోం శాఖ.!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడులు తగ్గుముఖం...  స్పష్టం చేసిన హోం శాఖ.!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 5-8-2019 నుంచి 9-9-2020 వరకూ ఒక్క మేజర్ అటాక్ కూడా జరగలేదని కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్ లో ఉగ్రవాద పరిస్థితిపై పార్లమెంట్ లో సభ్యులడగడంతో కిషన్ రెడ్డి పై విధంగా ప్రకటించారు. ఆగస్టు 5,2019 తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద దాడులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని ఆయన తెలిపారు. 2019 ఆగస్టు కంటే ముందు 455 ఉగ్రవాద సంఘటనలు జరిగాయని, ఆ తర్వాత మాత్రం 211 సంఘటనలు మాత్రమే జరిగినట్లు ఆయన తెలిపారు. కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఐసిస్ కార్యకలాపాలు అత్యంత క్రియాశీలకంగా ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తన రిపోర్టులో పేర్కొందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.