ఏపీకి అచ్చెన్న.. తెలంగాణకు మళ్లీ రమణే..

ఏపీకి అచ్చెన్న.. తెలంగాణకు మళ్లీ రమణే..

వరుస ఎదురుదెబ్బలు తగులుతోన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించారు.. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేరు, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్ రమణను ప్రకటించారు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. ఇక, 24 మంది సభ్యులతో కొత్త పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు.. 27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ప్రకటించారు.. కొత్తగా ప్రకటించిన కమిటీల్లో ఆరుగురిని వైస్‌ ప్రెసిడెంట్లుగా నియమించిన చంద్రబాబు.. సెంట్రల్‌ జనరల్ కమిటీ సభ్యులుగా మరో 8మందిని ప్రకటించారు. అయితే, ఎల్‌. రమణను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు.. చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినా.. మళ్లీ ఆయనకే అవకాశం కల్పించారు చంద్రబాబు.