ఐపీఎల్ 2020 : కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బలాలు... బలహీనతలు

ఐపీఎల్ 2020 : కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బలాలు... బలహీనతలు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఈ ఏడాది కెప్టెన్ మారాడు, కొత్త కోచ్ కూడా వచ్చాడు. జట్టులో కూడా కొత్త ఆటగాళ్లు ఎక్కువగా  కనిపిస్తున్నారు. గతంతో పోలిస్తే మ్యాచ్ వినర్లు కూడా పెరిగారు. అయితే ఐపీఎల్ ఆరంభ సీజన్ లో సెమీస్ కు చేరిన పంజాబ్ జట్టు ప్రదర్శన తర్వాతి సీజన్ లలో పడిపోయింది. 2014 లో ఫైనల్ కు చేరడం మినహా ఈ జట్టు చేసిన అద్భుతాలు ఏమి లేవు. అయితే గత కొన్ని సీజన్ల నుండి జట్టులోని ఆటగాళ్లను, కెప్టెన్ లను మారుస్తున్న ఫలితాలు రావడం లేదు. కానీ ఈ ఏడాది మాత్రం తమ మార్పులు జట్టు రూట్ ను ఓటమి నుండి విజయాల వైపుకు మారుస్తాయని ఆశతో ఉంది. ఐసీసీ టీ 20 ర్యాకింగ్స్ లో భారత్ తరపున అత్యుత్తమంగా 4 స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్ కు జట్టు పగ్గాలను అప్పగించింది. 

బలాలు : ఈ ఏడాది రాహుల్ కు కెప్టెన్సీ ఇవ్వడం ఈ జట్టుకు ప్రధాన బలం. అలాగే బ్యాట్స్మెన్స్ గేల్ సూపర్ హిటింగ్, స్టాంగ్ బ్యాటింగ్, బెస్ట్ ఫినిషర్స్ ఈ జట్టుకు సొంతం.  ఇక జట్టులో కీ ప్లేయర్స్ గా రాహుల్, గేల్, మాక్స్వెల్, నికోలస్ పురన్, మహ్మద్ షమీ కొనసాగుతున్నారు.

బలహీనతలు : రాహుల్ మినహా అద్భుతంగా రాణించే దేశీయ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, ఆల్ రౌండర్లు అలాగే స్పిన్ బౌలింగ్ లో ఈ జట్టు వెనుకబడిపోయింది.

అయితే ఐపీఎల్ 2020 లో ఈ రోజు ఢిల్లీ తో మొదటి మ్యాచ్ ఆడనున్న ఈ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.