ఐపీఎల్ 2020 : అర్ధశతకం చేసిన గిల్.. పంజాబ్ టార్గెట్..? 

ఐపీఎల్ 2020 : అర్ధశతకం చేసిన గిల్.. పంజాబ్ టార్గెట్..? 

ఐపీఎల్ 2020 లో ఈ రోజు షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ బౌలింగ్ ఎంచుకొని కేకేఆర్ ను బాగానే కట్టడి చేసారు. అయితే మొదటి రెండు ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయిన కోల్‌కత ను ఓపెనర్ శుబ్మాన్ గిల్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆదుకున్నారు. ఈ ఇద్దరు అవకాశం వచ్చినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కానీ మోర్గాన్ 40 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరుకున్న గిల్ మాత్రం మరికాసేపు నిలబడ్డాడు. 45 బంతుల్లో 57 పరుగులతో అర్ధశతకం పూర్తి చేసిన గిల్ షమీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ లలో లాకీ ఫెర్గూసన్(24) మినహా మరెవరు రెండంకెల పరుగులు చేయలేదు. దాంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది కోల్‌కత. ఇక పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు, మురుగన్ అశ్విన్, మాక్స్వెల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించాలంటే 150 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఐపీఎల్ లో వరుసగా నాలుగు విజయాలు సాధించి మంచి ఫామ్ లో ఉన్న పంజాబ్ కు ఈ లక్ష్యం ఛేదించడం కష్టం కాదు అనే చెప్పాలి. కానీ మళ్ళీ చివర్లో తడబడితే మాత్రం పరాజయం తప్పదు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.