ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే పంజాబ్ గెలవాల్సిందే...

ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే పంజాబ్ గెలవాల్సిందే...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు పంజాబ్ ఢిల్లీ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తే ఢిల్లీకి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అవుతుంది. అలాగే పంజాబ్ ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పకుండ గెలవాల్సిందే. ప్రస్తుతం పంజాబ్ ఐపీఎల్ 2020 లో కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి 6 పాయింట్లతో టేబుల్ 7వ స్థానంలో ఉండగా ఈ ఏడాది ఐపీఎల్ లో 7 విజయాలు నమోదుచేసి 14 పాయింట్లతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ రెండు జట్లు మొదటిసారి తలపడినప్పుడు అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ లో ఢిల్లీ విజయం సాధించింది. 

ప్రస్తుతం వరుసగా రెండు విజయాలు నమోదుచేసి ఆత్మవిశ్వసం తో ఉన్న పంజాబ్ టోర్నీ మొదటినుండి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న ఢిల్లీని కట్టడి చేయగలదా అనేది ప్రశ్న. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రావడంతో జట్టుకు బ్యాటింగ్ బలం బాగానే పెరిగింది. ఆ విషయాన్ని మనం గత రెండు మ్యాచ్ లలోను చూసాం. అయితే ఈ జట్టుకు ఎంత మంచి ఆరంభం లభించిన చివర్లో తడబడి మ్యాచ్ లను చేజార్చుకుంటుంది. కాబట్టి మ్యాచ్ ను ముగించే విషయంలో పంజాబ్ జట్టు పక్క ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. అలాగే బౌలింగ్ లో షమీకి మరొక బౌలర్ సహకరిస్తే పంజాబ్ ఢిల్లీకి చెక్ పెట్టగలదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.