బ్రహ్మచారిగా ఉన్నారా.. పన్నుకట్టాల్సిందే..!!

బ్రహ్మచారిగా ఉన్నారా.. పన్నుకట్టాల్సిందే..!!

చట్టాలు పలురకాలు... ఒక్కోచోట ఒక్కోరకమైన చట్టాలు అమలులో ఉంటాయి.  కొన్ని చట్టాలు అందరికి ఉపయోగపడే విధంగా ఉంటె.. మరి కొన్ని చట్టాలు ఎందుకు పెట్టారో అర్ధంకాకుండా ఉంటాయి.  చట్టాలు, పన్నులు అన్నది ఇప్పటివి కాదు.. ఎప్పటి నుంచో అమలులో ఉన్నాయి.  ఇప్పుడు మనం పాటిస్తున్న చట్టాలు చాలా తక్కువ.. బ్రిటిష్ కాలంలో చట్టాలు దారుణంగా ఉండేవన్న సంగతి తెలిసిందే.  స్వాతంత్రం రాకపూర్వం మనదేశంలో ఉప్పుపై కూడా పన్ను విధించారు.  

ఇదిలా ఉంటె, దేశంలో బ్రహ్మచారులు ఎక్కువగా ఉంటె.. వారిపై కూడా పన్ను వేసేవారట.. షాక్ అవ్వకండి.. ఈ పన్ను ఇక్కడ కాదు.. ఇప్పుడు కాదు.. రోమ్ చక్రవర్తి కాలంలో ఇలాంటి క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రోమ్ చక్రవర్తి అగస్టన్ బ్రహ్మచారులపై పన్ను విధించేవారట.  వివాహం చేసుకోకుండా ఉండే యువకులు అత్యాచారాలకు, అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువ ఉంటుందట. అందుకే పన్ను భారం భరించలేక వివాహం చేసుకొని సమాజంలో బాధ్యతతో మెలుగుతారని అగస్టస్‌ భావించాడు. అందుకే అలాంటి పన్నులు వేసేవాడని చరిత్రకారులు పేర్కొన్నారు.  ఇవే కాకుండా అప్పట్లో చక్రవర్తి అగస్టన్ పలురకాల పన్నులు కూడా విధించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు.